Home> తెలంగాణ
Advertisement

Hyderabad: బాలుడిపై యువకుడు లైంగిక దాడి...చాక్లెట్ ఇస్తానని చెప్పి..

Hyderabad: బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 

Hyderabad: బాలుడిపై యువకుడు లైంగిక దాడి...చాక్లెట్ ఇస్తానని చెప్పి..

Hyderabad Crime news: హైదరాబాద్(Hyderabad)లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు బాలుడిపై లైంగికదాడి(Sexual assault)కి పాల్పడన ఘటన చిలకలగూడ(chilakalaguda) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పార్శిగుట్ట మధురానగర్‌ కాలనీకి చెందిన సతీష్‌ (23) సికింద్రాబాద్‌లోని రంగురాళ్లు విక్రయించే దుకాణంలో వర్క్ చేస్తున్నాడు. ఈనెల 24న సాయంత్రం పార్శిగుట్టకు చెందిన బాలుడు (13)ని చాక్‌లేట్స్ ఇస్తానని చెప్పి నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం లైంగికదాడికి పాల్పడ్డాడు.

Also Read: Fake Baba : తల్లి ఆరోగ్యం బాగా చేస్తానని నమ్మించి ఇద్దరు అక్కాచెల్లెళ్ల‌పై బాబా అత్యాచారం

తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు(Police) నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిలకలగూడ సీఐ నరేష్‌ పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More