Home> తెలంగాణ
Advertisement

Monkeys Attack on Woman: ఇంట్లోకి ప్రవేశించిన కోతుల దాడి.. మహిళ మృతి

Monkeys Attack on Woman | ఇంట్లోకి వచ్చిన కోతులు దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ గ్రామానికి కోతుల బెడదను ఇప్పటికైనా పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. 

Monkeys Attack on Woman: ఇంట్లోకి ప్రవేశించిన కోతుల దాడి.. మహిళ మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చిన కోతులు దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఎమదిరాల మండలం కుక్కడం గ్రామంలో దోమల శ్రీలత అనే మహిళ ఇంట్లోకి మంగళవారం (డిసెంబర్ 1న) ఉదయం కొన్ని కోతులు ప్రవేశించాయి. ఇది గమనించిన శ్రీలత ఆ కోతులను ఇంట్లో నుంచి వెళ్లకొట్టేందుకు యత్నించింది.

 

శ్రీలత కోతులను తరమడంలో భాగంగా వాటిని కొట్టేందు యత్నించింది. దీంతో కొన్ని కోతులు ఆమెపై దాడి చేశాయి. ఇంట్లో ఒక్కతే ఉండటంతో ఆందోళన చెందిన శ్రీలత కోతుల బారి నుంచి తప్పించుకునే యత్నం చేసింది. ఈ క్రమంలో జారిపడి గడపపై పడిపోయింది. శ్రీలత తలకు తీవ్రమైన గాయం కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Also Read : Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!

 

మహిళ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుక్కడం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారని సమాచారం. తమ గ్రామానికి కోతుల బెడదను ఇప్పటికైనా పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. 

Also Read : LPG Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 క్యాష్ బ్యాక్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 
Read More