Home> తెలంగాణ
Advertisement

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో చివరి గంటలో ఏం జరిగింది..పోలింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగింది

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో అసలేం జరిగింది. ముఖ్యంగా చివరి గంటలో ఏమైంది. కేవలం గంట వ్యవధిలో పోలింగ్ శాతం ఎలా పెరిగింది. ఇప్పుడీ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి.

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో చివరి గంటలో ఏం జరిగింది..పోలింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగింది

GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో అసలేం జరిగింది. ముఖ్యంగా చివరి గంటలో ఏమైంది. కేవలం గంట వ్యవధిలో పోలింగ్ శాతం ఎలా పెరిగింది. ఇప్పుడీ ప్రశ్నలే ఆసక్తి రేపుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections ) నమోదైన పోలింగ్ శాతంపై అందరూ విస్మయం చెందారు. గ్రేటర్ వాసులు పోలింగ్ బూత్‌కు రావడంతో పూర్తిగా నిరాసక్తత చూపించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకూ ఎటువంటి పురోగతి కన్పించలేదు. ఓ దశలో 40 శాతం పోలింగ్ దాటుతుందా అనే సందేహం నెలకొంది. ఎందుకంటే 5 గంటల వరకూ కేవలం 35 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

అటువంటిది పోలింగ్ చివరి గంట ( Last hour polling ) లో నిజంగానే మిరాకిల్ జరిగినట్టుంది. పోలింగ్ 45.71 ( Ghmc polling )‌ కు చేరుకుంది. అంటే చివరి గంటలో ఏం జరిగింది. ఉదయం నుంచి 12 గంటల సేపు ఓటర్లు వస్తారనుకుని నిరీక్షించిన పోలింగ్ సిబ్బందికి చివరి గంటలో ఒక్కసారిగా పని పడింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో ఒక్కసారిగా ఓటర్ల నిరీక్షణ క్యూ రూపంలో కన్పించింది. Also read: GHMC Elections 2020: స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం..రీ పోలింగ్ రేపే

అప్పటి వరకూ రాని ఓటర్ల చివరి గంటల్లో వచ్చి ఓట్లేశారు. అందుకే చివరి గంటలో ఏకంగా పది శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల్నించి 9 గంటల వరకూ కేవలం 3.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. సాయంత్రం 4-5 గంటల వరకూ ఇలాగే కొనసాగింది. చివరి గంటలో మాత్రం అద్భుతమే జరిగింది.

అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి పోటెత్తారు. సమయం మించిపోతుందని కేంద్రాల్లోకి చొచ్చుకువచ్చినట్టు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి కానీ వాస్తవానికి ఇదెలా సాధ్యం. 12 గంటల సేపు రాని ఓటర్లు ఒక్కసారిగా ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారు. నిజంగానే ఇదంతా ఓ మిరాకిల్‌లా ఉందని రాజకీయ పక్షాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

మరి చివరి గంటలో నమోదైన పోలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇదంతా రిగ్గింగ్ లేదా దొంగ ఓట్ల వ్యవహారమా అనే సందేహం కూడా నెలకొంది. పోలీసులు, ఎన్నిల సంఘం ( Election commission ) సంయుక్తంగా కలిసి ఈ వ్యవహారం నడిపారనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. Also read: GHMC Elections 2020: భారీగా తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం..ఓ విశ్లేషణ

Read More