Home> తెలంగాణ
Advertisement

Weather Report: రాగల 3 రోజుల పాటు తెలంగాణలో రెడ్ అలర్ట్.. అత్యవరసరమైతే తప్ప బయటకు రాకండి..

Telangana Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజల అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలో కూడా రాగల 72 గంటల్లో వాతావరణం పొడి ఉండి.. వడగాల్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather Report: రాగల 3 రోజుల పాటు తెలంగాణలో రెడ్ అలర్ట్.. అత్యవరసరమైతే తప్ప బయటకు రాకండి..

Telangana Weather Report: ఏప్రిల్లో భానుడు చెలరేగిపోయాడు. గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టు సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. సాధారణంగా కంటే 4, 5 డిగ్రీలు ఎక్కువ నమోదు అయ్యాయి. అంతేకాదు ఏప్రిల్ నెలలో వందేళ్ల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు కొట్టింది. తెలంగాణలో హైదరాబాద్, భద్రాచలం, రామగుండం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు బయటకు రావాలంటే భయపడే స్థితి నెలకొంది. చాలా చోట్ల అర్దరాత్రి దాటినా ఉష్ణోగ్రతలు చల్లబడటం లేదు. దీంతో ప్రజలు ఇంట్లో ఏసీ లేదా ఇతర చల్లటి ప్రదేశాల్లో ఉంటూ సేద తీరుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా వాయువ్య దిశలో రాజస్థాన్ నుంచి వస్తోన్న వేడి గాలులుతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయన్నట్టు పేర్కొంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలు దాటింది. నిన్న వడదెబ్బకు ఎనిమిది మందు చనిపోయారు. మొత్తంగా రాష్ట్రంలో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

అంతేకాదు రామగుండం, పెద్దపల్లి వంటి కోల్ మైన్ ప్రాంతాల్లో రాత్రివేళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తంగా ఎండల్లో తిరిగే వారు.. తలపై ఏదైనా ఖర్చీఫ్, టోపీ లాంటి పెట్టుకోకుండా బయటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  అంతేకాదు అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు నీళ్లు క్యారీ చేయడం ఉత్తమం. కొబ్బరి బొండం నీళ్లతో పాటు పండ్లను.. ఇతర ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం ఒంట్లో ఉన్న వేడి చల్లారుతోంది. మరోవైపు ఇతర బాండ్ల శీతల పానీయాలైన కోక్, పెప్సీ, థమ్స్ అప్ వంటి వాటికి దూరంగా ఉండటం బెటర్ అని హెల్త్ నిపుణులు చెబుతున్నారు.

Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో విడుదల.. అదిరిపోయే హామీలు ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More