Home> తెలంగాణ
Advertisement

KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం

KT Rama Rao Comments Lok Sabha Election Results Disappointment: లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒక్క సీటు గెలవకపోయినా.. తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం

KT Rama Rao: దేశంలో ఆసక్తికరంగా లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. తెలంగాణలో మాత్రం బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ మాదిరి జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవలేదు. ఈ ఫలితాలు గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశపర్చగా.. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. తమకు గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశామని.. తిరిగి పుంజుకుంటామని ప్రకటించారు.

Also Read: Revanth, KCR Wishes: చంద్రబాబుకు శిష్యుడు రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు.. కేసీఆర్‌తో సహా

 

'లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుంది. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉంది' అని కేటీఆర్‌ తెలిపారు. తమకు అన్నింటి కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దానికి మించిన గౌరవం, విజయం మరేది లేదని ప్రకటించారు. గతంలోనూ ఇలాంటి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రజాదరణతో బీఆర్ఎస్ పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ సాధించడంతో పాటు ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

Also Read: Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం

 

ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుందని కేటీఆర్‌ చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్వల్ప తేడాతోనే ఓటమి పాలైందని గుర్తు చేశారు. 'ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమే. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దని పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారు. బీఆర్ఎస్ అదే సిద్ధాంతాన్ని పాటిస్తుంది' అని కేటీఆర్‌ తెలిపారు.

'తాజా ఫలితాలు కచ్చితంగా నిరాశ పరిచాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోయేది లేదు. ఎప్పటి లాగే ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాం. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'తెలంగాణ ప్రజల గొంతుక బీఆర్ఎస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం' అని కేటీఆర్ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More