Home> తెలంగాణ
Advertisement

Kishan Reddy Spech: తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి

Kishan Reddy Fires On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయి ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు త్వరలోనే బహిష్కరిస్తారని జోస్యం చెప్పరు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
 

Kishan Reddy Spech: తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తారు: కిషన్ రెడ్డి

Kishan Reddy Fires On CM KCR: పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బహిష్కరించే సమయం ఎంతో దూరంలో లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే నాలుగు నెలల తర్వాత అధికార బీఆర్ఎస్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అవినీతి గురించి అర్థమైందని.. అందుకే అధికార పార్టీలో భయం పట్టుకుందన్నారు.

త్వరలోనే తెలంగాణలోని అన్ని వర్గాలు సంపూర్ణంగా బీఆర్ఎస్‌ను బహిష్కరించబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ యువత, దళితులు, రైతులు బహిష్కరించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించపోయినా.. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నందుకే మోదీ పర్యటను బహిష్కరించారా..? అని ప్రశ్నించారు. మోదీ రాకతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. తెలంగాణ అభివృద్ధి చెందడం ఇష్టం లేకే ఇలాంటి చవకబారు ప్రకటను చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై ప్రజలు విసిగి పోయారని అన్నారు. వీరిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తూ.. ఫామ్‌హౌస్‌కే పరిమితం చేసే రోజులు ఎంతో దూరంలో లేవని కిషన్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఎన్నో ఏళ్ల కల అయిన రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను, రైల్వే పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను రూ. 521 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన మోదీకి సమస్త తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం.. ఎప్పుడు అడిగినా అన్నిరకాలుగా అండగా నిలుస్తోందన్నారు. రూ.5,588 కోట్ల వ్యయంతో చేపడుతున్న రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉండటంతోపాటుగా.. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. రాష్ట్రంలో మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందన్నారు.

Also Read: Happy Birthday Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బర్త్ డే స్పెషల్.. దాదా కెరీర్‌లో మర్చిపోలేని వివాదాలు  

Also Read: HDFC Bank Interest Rates: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..!  ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More