Home> తెలంగాణ
Advertisement

Kishan Reddy: దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.. ఎందుకంటే..?: కిషన్ రెడ్డి

BJP State Council Meeting: తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ లేకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు.
 

Kishan Reddy: దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.. ఎందుకంటే..?: కిషన్ రెడ్డి

BJP State Council Meeting: తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు నిజామాబాద్ సభలో పాల్గొని తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని చెప్పారు. నరేంద్ర మోడీ సభ భారీగా జనం హాజరయ్యారని.. ప్రధాని మీద తెలంగాణ ప్రజలకు ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. దళిత సీఎం అని దళితులకు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మూడెకరాలు భూమి ఇస్తానని శాసనసభలో చెప్పి మోసం చేశాడని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మోసం అలాంటి వ్యక్తి బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు.

"తెలంగాణ సాధనాలో ఎంత మంది బలిదానం చేశారు..? 369 మంది తెలంగాణ విద్యార్ధుల చంపిన ఘనత కాంగ్రెస్‌ది. చివరి దశ ఉద్యమంలో కూడా 1200 మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్‌కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ లేకుంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా..? తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఓటింగ్‌లో పాల్గొన్నాడా..? అలాంటి వ్యక్తికి తెలంగాణను ఏలే హక్కు లేదు. ప్రజలను కేసీఆర్ తాగుడుకు బానిసలు చేస్తున్నాడు. ఒక్కొ చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి మరో చేతిలో లాక్కుంటున్నాడు. తాగుడు వల్ల అనేక మంది ఆడబిడ్డల పుస్తెలు తెగినయ్.

సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. ఎలక్షన్స్ ముందు భూములు అమ్మాడు. మద్యం షాపులు వేలం వేశాడు. రింగ్ రోడ్‌ను తెగనమ్మాడు. మద్యం అమ్మనిదే.. అప్పులు చేయనిదే ప్రభుత్వం నడిచేలా లేదు. తెలంగాణ బంగారం కాలేదు. కానీ కేసీఆర్, బీఆర్ఎస్ నేతల కుటుంబం  మాత్రం బంగారమయ్యాయి. నిజాం వారసులైన మజ్లీస్‌తో కేసీఆర్ చేతులు కలిపాడు. మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింతగా పెరిగింది. కచ్చితంగా తెలంగాణ కాషాయ జెండా ఎగురుతుంది. కేసీఆర్ మహిళ వ్యతిరేకి.. మహిళల వ్యతిరేకి అయిన తెలంగాణ కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు దూరంగా ఉన్నారు.." అని కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ చేసేవి బట్టే బాజ్ పనులు.. చెప్పేవి శ్రీరంగ నీతులు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో కొన్ని మంది కుక్కలు మోదీపై ట్విట్టర్‌లో మోరుగుతున్నాయన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నాయకుడి స్థాయి ఎంత..? అని నిలదీశారు. తెలంగాణ చాలా ప్రమాదకర స్థాయిలో పడిందన్నారు. ఇతర ప్రాంతాల ముస్లింలకు ఓటర్ జాబితాలో పేర్లు నమోదుచేసుకొని పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకారంతో అధికారంలోకి రావాలని ఎంఐఎం కుతూహలంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల దగ్గరకు వెళ్లడం లేదని.. సుట్ కేసులతో  దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి.. తమ దగ్గర MIM అభ్యర్థిని పోటీలో పెట్టవద్దని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. 

Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు   

Also Read: Shikhar Dhawan Divorce Reason: మాజీ భార్య కారణంగా భారీగా నష్టపోయిన శిఖర్ ధావన్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More