Home> తెలంగాణ
Advertisement

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. పెరిగిన బస్ పాస్ చార్జీలు... పూర్తి వివరాలివే...

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. జనరల్, ఎన్జీవో బస్ పాస్ చార్జీలను పెంచుతూ టీఎస్ఆర్టీసీ  నిర్ణయం తీసుకుంది. పెరిగిన బస్ పాస్ చార్జీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. పెరిగిన బస్ పాస్ చార్జీలు... పూర్తి వివరాలివే...

TSRTC Hikes Bus Pass Fares: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. జనరల్, ఎన్జీవో బస్ పాస్ చార్జీలను పెంచుతూ టీఎస్ఆర్టీసీ  నిర్ణయం తీసుకుంది. బస్ పాస్‌లపై గరిష్ఠంగా రూ.500 మేర పెంపుకు నిర్ణయం తీసుకుంది. పెరిగిన బస్ పాస్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బస్ పాస్‌ ఉపయోగించే ప్రయాణికులకు అదనపు భారం తప్పదు.

పెరిగిన జనరల్ బస్ పాస్ చార్జీల వివరాలు :

1) ఆర్డినరీ బస్ ​పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి పెంపు
2) మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్ ​పాస్‌ చార్జీ రూ.1070 నుంచి రూ.1,300కు పెంపు
3) మెట్రో డీలక్స్‌ బస్ ​పాస్‌ చార్జీ రూ.1185 నుంచి రూ.1450కి పెంపు
4) పుష్పక్‌ బస్ ​పాస్‌ చార్జీ రూ.2500 నుంచి రూ.3000కి పెంపు

పెరిగిన ఎన్జీవో బస్ పాస్ చార్జీల వివరాలు : 

1) ఆర్డినరీ బస్​పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కి పెంపు
2) మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి పెంపు
3) మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కి పెంపు
4) ఎంఎంటీఎస్‌- ఆర్టీసీ కాంబో టికెట్ చార్జీ రూ.1090 నుంచి రూ.1350కి పెంపు

ప్యాసింజర్ సెస్ : 

ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ.5, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ.10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఆదివారం (మార్చి 27) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.  ఈ నిర్ణయంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. 

Also Read: Yadadri Inauguration Photos: కన్నుల పండుగగా యాదాద్రి పున:ప్రారంభోత్సవం.. వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

GT vs LSG: ల‌క్నోను షమీ దెబ్బకొట్టినా.. ఆదుకున్న దీపక్ హుడా, ఆయుష్ బదోని! గుజరాత్ లక్ష్యం ఎంతంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More