Home> తెలంగాణ
Advertisement

Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?

Medaram Jatara Bus Timings: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. 
 

Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?

Medaram Jatara Bus Timings: ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా మేడారం జాతర ప్రసిద్ధి చెందింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఎంతో చరిత్ర ఉంది. ప్రతి రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు నాలుగు రోజులు సాగే మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతారు. ఈ సారి ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. 

సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ మీటంగ్ కు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి మేడారానికి ఫిబ్రవరి 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు మంత్రి అజయ్ తెలిపారు. 

ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల నుంచి ఎంజీబీఎస్ లో (హైదరాబాద్ డిపో-1) మేడారం బస్సులు బయలుదేరుతాయని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. అదే విధంగా ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్ కు బస్సులు తిరుగు పయనమవుతాయని తెలిపారు. 

ఎంజీబీఎస్ లోని డిపో-2 నుంచి అదే రోజున ఉదయం 7 గంటల బయలుదేరి.. అక్కడ సాయంత్రం 4 గంటలకు తిరుగు పయనమవుతాయి. ఆ తర్వాత హైదరాబాద్ లో 8 గంటలకు ప్రారంభమయ్యే బస్సులు సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయల్దేరతాయని తెలుస్తోంది. ఆన్ లైన్ లో ఆర్టీసీ వెబ్ సైట్ లేదా టీఎస్ఆర్టీసీ యాప్ లో టికెట్లను బుక్ చేసుకునేందుకు సదుపాయం ఉంది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఒక్కరికి రూ.398 ఛార్జీగా వసూలు చేయనున్నారు. 

కొవిడ్ మార్గదర్శకాలు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంది. మాస్కులు ధరించడం సహా చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీ సూచించింది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న ఈ మహా జాతరకు లక్షలాది భక్తులు తరలి రానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది.  

Also Read: Telangana Covid Cases: తెలంగాణ మరోసారి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Also Read: Siddipeta: సిద్దిపేటలో కాల్పుల కలకలం... రూ. 43 లక్షలు దోచుకెళ్లిన దుండగులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More