Home> తెలంగాణ
Advertisement

TSPSC AEE Jobs Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSPSC 1540 AEE Jobs Notification: టిఎస్పీఎస్సీ నుండి తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వెలువడింది. తెలంగాణలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC AEE Jobs Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSPSC 1540 AEE Jobs Notification: టిఎస్పీఎస్సీ నుండి తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వెలువడింది. తెలంగాణలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1540 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన కమిటీ భేటీలో ఈ నోటిఫికేషన్ ని ఆమోదించినట్టు టిఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. 

నోటిఫికేషన్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో (సివిల్) మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం 302 పోస్టులు
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో (సివిల్) 211 పోస్టులు

fallbacks

సెప్టెంబర్ 9వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించనుండగా.. అక్టోబర్ 10వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. అన్ని పోస్టులకు 18-44 ఏళ్ల ఏజ్ గ్రూప్ వారు అర్హులుగా టిఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. టిఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in లో ఈ నెల 15వ తేదీ నుంచి నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులోక రానున్నాయి. 

అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రకటన జారీ చేస్తూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పి షాకిచ్చింది. హెవీ మోటార్ లైసెన్స్ నిబంధన విషయంలో భారీ సంఖ్యలో నిరుద్యోగులు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిఎస్పీఎస్సీ స్పష్టంచేసింది.

Also Read : September 17th: తెలంగాణలో 17న ఏం జరగబోతోంది..? కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ కీలక ప్రకటనలు..!

Also Read : KCR Photo at Wines: తెలంగాణలో ముదిరిన ఫోటో వార్.. వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలనే డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More