Home> తెలంగాణ
Advertisement

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

TSPSC Group 1 Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంకా ఎన్ని పేపర్లు లీక్ చేశాడో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేపర్ల లీకేజీ వ్యవహారం అంతా అమ్మాయిల కోసం జరిగినట్లు తెలుస్తోంది.
 

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

TSPSC Group 1 Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తోంది. టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ పేపర్ లీక్‌తో మొదలైన ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కూడా గ్రూప్ 1 పరీక్ష రాయగా.. అతడికి 100 పైగా మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 16వ తేదీన 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగ్గా.. జనవరి 13న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 25,150 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రవీణ్‌ రాసిన గ్రూప్ 1 పేపర్‌ను అధికారులు వెరి ఫై చేస్తున్నారు. పేపర్ల లీకేజీ వ్యవహారం బయటపడడంతో తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో మెయిన్స్‌కు క్వాలీఫై అయిన అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. పేపర్ లీక్ అయినట్లు తేలితే.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాల్సి వస్తుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

 

ప్రవీణ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. విచ్చలవిడిగా అమ్మాయిల నగ్న చిత్రాలు, మహిళలతో అసభ్య చాటింగ్‌లను గుర్తించారు. ప్రవీణ్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌ పంపించగా.. ఈ నెల 25 తరువాత నివేదిక రానుంది. పేపర్ల లీకేజీ వ్యవహారం అంతా అమ్మాయిల కోసం జరిగినట్లు తెలుస్తోంది. 

ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?

మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక నుంచి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన తమ్ముడు రాజేశ్వర్‌ నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం తెప్పించేందుకు తన భర్త ఢాక్యానాయక్‌, టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్‌తో కలిసి ప్లాన్ చేసి దొరికిపోయారు.

ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీలో కారుణ నియామకం ఉద్యోగం సంపాదించాడు. తన తండ్రి హరిచంద్రరావు విధి నిర్వహణలో మరణించగా.. ఆ ఉద్యోగం ప్రవీణ్‌కు వచ్చింది. గతంలో రేణుక గురుకుల టీచర్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో దరఖాస్తులో కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని ఆమె సరిదిద్దుకునేందుకు ఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లారు. అప్పుడే ప్రవీణ్‌ పరిచయం అయ్యాడు. అతని నెంబరు తీసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయంతోనే తన తమ్ముడు రాజేశ్వర్ నాయక్‌ కోసం పేపర్ లీక్ చేయాలని అడిగింది. 

ఆమెతో డీల్ కుదుకుర్చుకున్న ప్రవీణ్‌.. ఐపీ అడ్రస్‌ను తెలుసుకుని నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డితో కలిసి టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ పేపర్‌ను సేకరించాడు. ప్రశ్నాపత్రాన్ని పెన్‌డ్రైవ్‌లలో సేవ్ చేసుకుని.. రేణుకకు 10 లక్షల రూపాయలకు అమ్మేశాడు. రేణుక దంపతులు ఈ ప్రశ్నాపత్రాలను  13 లక్షల రూపాయలకు ఇతర అభ్యర్థులకు విక్రయించారు. ఈ వ్యవహారంపై అధికారులకు సమాచారం రాగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read: Dogs Attack on Boy: తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి  

Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్‌ ఏర్పాటుకు కారణం ఆయనే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More