Home> తెలంగాణ
Advertisement

TSPSC Group 1: రెండు రోజుల్లో గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు.. చెక్ చేసుకోండి ఇలా..

TSPSC: తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి.
 

TSPSC Group 1: రెండు రోజుల్లో గ్రూప్‌ 1 హాల్‌టికెట్లు.. చెక్ చేసుకోండి ఇలా..

TSPSC Group 1 Hall Tickets 2022: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. అక్టోబర్‌ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను రేపు లేదా ఎల్లుండి నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. హాల్‌ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ దాదాపు 3,80,202 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 756 మంది పోటీపడుతున్నారన్న మాట. ఇందులో 225 పోస్టులను మహిళలకే రిజర్వ్ చేశారు. అయితే టీఎస్పీఎస్సీ మెయిన్స్ పరీక్షకు ఒక్కోపోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేయనుంది. గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ (Group 1 Preliminary exam) నిర్వహణకు సంబంధించి అన్ని  జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. 

త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్
తెలంగాణ ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూనే.. పరీక్షల నిర్వహణను కూడా అంతే వేగంగా చేపడుతున్నారు. ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల ఆర్థిక మంత్రి హారీశ్ రావు కీలక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. 

Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More