Home> తెలంగాణ
Advertisement

TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్

TS inter results 2020 | హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పరీక్షల ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్ కమిషనర్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు.

TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్

TS inter results 2020 | హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పరీక్షల ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాళ మధ్యాహ్నం గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్ కమిషనర్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టీయర్ పరీక్షలకు 4 లక్షల 80 వేల 555 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో జనరల్ విద్యార్థులు 4,31,358 మంది ఉన్నారు. ఒకేషనల్‌లో 49,197 మంది ఉన్నారు. జనరల్‌లో 61.07 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఒకేషనల్ విద్యార్థుల్లో 50.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా 60.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలబడింది. రంగారెడ్డి జిల్లా 71 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలవగా, కుమ్రంభీం జిల్లా మూడో స్థానం సొంతం చేసుకుంది. Grade-A లో 1 లక్ష 49 వేల 38 మంది ఉత్తీర్ణత సాధించగా.. Grade-B లో 69,547 మంది పాస్ అయ్యారు. Grade-C లో 31,353 మంది పాస్ కాగా D-Grade లో 13,525 మంది పాస్ అయ్యారు.

( Telangana exams: డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ )

ఇక సెకండీయర్‌ ఫలితాల విషయానికొస్తే... 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు హాజరు కాగా 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానంలో నిలవడం విశేషం. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకుంది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలు ఆన్‌లైన్ లింకు కోసం విద్యార్థులు ఈ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 

http://examresults.ts.nic.in

http://results.cgg.gov.in   

tsbie.cgg.gov.in,

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ అధికారిక వెబ్‌సైట్స్ లింక్ ఓపెన్ కానిపక్షంలో ప్రత్యామ్నాయంగా మనబడి లాంటి వెబ్‌సైట్స్‌లోనూ Telangana Inter results 2020 ని చెక్ చేసుకోవచ్చు. 

results.cgg.gov.in

manabadi.com

manabadi.co.in

ఫలితాల వెల్లడిలో ఏవైనా సందేహాలున్నా.. ఫిర్యాదులు ఉన్నా..  www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ అధికారులు తెలిపారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More