Home> తెలంగాణ
Advertisement

పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతన పెంపు నిర్ణయం ఉపసంహరణ

ULBs honorarium: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్నితీసుకుంది. నగర, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతన పెంపు నిర్ణయం ఉపసంహరణ

Telangana Government withdrew the orders issued enhancing the honorarium: పట్ణణ ప్రాంత స్థానిక ప్రజా ప్రతినిధుల గౌరవవేతనం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్​పర్సన్​లు, డిప్యూటీ ఛైర్​పర్సన్లు,​ కార్పొరేటర్లు, కౌన్సిలర్స్​ల గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు పురపాలకశాఖ (honorarium of TS ULBs) నవంబర్ 18న (గురువారం) ప్రకటించింది.

ఈ ఏడాది జూన్​ నుంచి ఈ పెంచిన వేతనం అమలులోకి వస్తుందని తెలిపింది పురనపాలక శాఖ. అయితే మరుసటి రోజే అంటే.. నవంబర్ 19న (శుక్రవారం) ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Also read: 'అధికారం కన్నా.. ప్రజాశక్తే గొప్పది'- ఇది పూర్తిగా రైతుల విజయం!

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావలి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే గౌరవ వేతనాల పెంపునకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలపడం గమనార్హం.

Also read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి... ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం...

పెంపు ప్రణాళిక ఇలా..

రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పాలక, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనంతో పాటు, టీఏ 30 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చి ఉంటే.. మేయర్ల వేతనం (Mayor honorarium in Telangana) రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెరిగేది. డిప్యూటీ మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32,500లకు చేరేది. కార్పొరేటర్ల గౌరవ వేతనం (Corporators honorarium in Telangana) రూ.6 వేల నుంచి రూ.7,800కు పెరిగేది.

Also read: క్యారీ బ్యాగ్ కొనుగోలు చేయమని ఒత్తిడి.. పిజ్జా కంపెనీకి రూ.11 వేలు జరిమానా

మున్సిపాలిటీల్లో.. 

ఛైర్​పర్సన్​లకు రూ.15,600 గౌరవ వేతనం లభించేది. ప్రస్తుతం వీరికి రూ.12 వేల వేతనం అందుతోంది. డిప్యూటి ఛైర్​పర్సన్​లకు వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500లకు పెరిగేది. కౌన్సిలర్ల గౌరవ వేతనం రూ.2,500 నుంచి రూ.3,250కి చేరేంది.

Also read: తెలంగాణలో 3,657 కరోనా యాక్టివ్ కేసులు

Also read: సింగరేణిలో మరో ప్రమాదం... బొగ్గు పెళ్లలు కూలడంతో అండర్ మేనేజర్ మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More