Home> తెలంగాణ
Advertisement

KCR Fire on Talasani: ఈటెల తరువాత మరో నేత మీద కేసీఆర్ ఆగ్రహం.. వేటు తప్పదా..?

టీఅర్ఎస్ పార్టీలో మరో మంత్రి మీద ఆధినేత ‌కేసీఆర్  గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో  ప్రాధాన్యత తగ్గించడంతో  పాటు పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు. ఈటెల తరువాత మరో మంత్రిమీద వేటు పడనుందని  టీఅర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతుంది.

KCR Fire on Talasani: ఈటెల తరువాత మరో నేత మీద కేసీఆర్  ఆగ్రహం.. వేటు తప్పదా..?

Kcr Fire on Talasani: టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అనుగ్రహం ఉంటేనే ఎంత పెద్ద నేత అయిన మనగలుగుతాడు. పార్టీని గానీ కేసీఆర్ ను గానీ ప్రశ్నిస్తే ఎంత పెద్ద నాయకుడైన పార్టీనుండి తప్పించడానికి కేసీఆర్ వెనుకడారు. పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్నాడని కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఈటెలను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసారు. కేసీఆర్ తో పోసగక  చాలా మంది నేతలు టిఆర్ఎస్ పార్టీని వీడారు. కానీ కేసీఆర్ స్టైల్ మాత్రం మారలేదు. రాజకీయ చాణక్యుడు అయిన  కేసీఆర్ కు నచ్చితే ఎవరినైనా పార్టీలోకి తీసుకొని పదవి ఇవ్వగలరు. ఇచ్చిన పదవిని అంతే ఈజీగా తీసేయ్యగలరు. 20ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీని తనగుప్పిట్లో పెట్టుకొని ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. 

ఈటెల ఎపిసోడ్ తరువాత టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు సైలెంట్ కాకా తప్పలేదు. అయితే ఇప్పుడు మరో మంత్రి వైఖరి మీద కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు  కేబినెట్లో కీలకమంత్రి అయిన మంత్రి తలసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని టాక్ వినిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పటికీ గతంలో ఉన్న సన్నిహిత్యంతో  టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేయడమే కాకుండ మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీనితో పాటు హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు అన్ని తలసానికే అప్పగించే వారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేని తలసాని కొడుకుకు సికింద్రాబాద్ ఎంపీ సీటు కూడా ఇచ్చాడు. కానీ టిఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగిన తలసానికి పార్టీలో  ప్రాధాన్యం తగ్గిందని అధినేత కేసీఆర్ కు తలసానికి మధ్య గ్యాప్ పెరిగిందని టిఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. 

కేసీఆర్-తలసానికి మధ్య గ్యాప్ పెరగడానికి రెండు,మూడు ప్రధాన కారణాలను  చెప్తున్నారు టిఆర్ఎస్ నేతలు. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ మధ్య కోల్డ్ వార్ ఢిల్లీ దాకా పాకింది. గవర్నర్ ను అడ్డంపెట్టుకుని బీజేపీ టిఆర్ఎస్, తెలంగాణ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిఆర్ఎస్ నేతలు. కానీ ఈ సమయంలో సికింద్రాబాద్ లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మంత్రి తలసాని, గవర్నర్ తమిళి సై తో కలిసి పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్రం, గవర్నర్ వైఖరిపై టిఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో తలసాని ఇలా వ్యవహరించడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించిందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మరో కారణం మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే ప్రకాశ్ రాజ్ ను కాదని ఇన్ డైరెక్ట్ గా మంచు విష్ణుకు తలసాని మద్దతు ఇచ్చారని విష్ణు గెలుపు తరువాత తలసాని విష్ణు కలవడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. మరో కారణం లోక్సభ ఎన్నికల సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన సాయి కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు గ్రేటర్ టిఆర్ఎస్ అధ్యక్షుడుగా సాయి కిరణ్ ను నియమించేలా అధిష్టానం మీద తలసాని ఒత్తిడి పెంచుతున్నాడని ఇందుకోసం కార్పొరేటర్లతో తలసాని రహస్య సమావేశాలు కూడా నిర్వహించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో తలసానిని కేసీఆర్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీలో తలసానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ విషయం మొన్నటి టిఆర్ఎస్ ఫ్లీనరీలో స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ ఓపెనింగ్ స్పీచ్ తరువాత  ఆయనను సత్కరించడానికి కుమారుడు సాయి కిరణ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో వచ్చిన తలసానిని సున్నితంగా తిరస్కరించారు. దీనితో సాయికిరణ్ స్టేజ్ దిగి వెళ్లిపోగా... ఫ్లీనరీ అయ్యేదాక తలసాని శాలువతోనే స్టేజ్ మీద ఉండిపోయాడు. ఈ మధ్య ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో కూడా తలసానిని  ముఖ్యమంత్రి కేసీఆర్ లైట్ తీసుకున్నారని చర్చ జరుగుతుంది. 

ఈటెల ఎపిసోడ్  తరువాత అసంతృప్త నేతలు సైలెంట్ అవడమే కాకుండా అధినేత దృష్టిలో పడేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇప్పుడు తలసాని ఎపిసోడ్  తెరపైకి రావడంతో తలసాని విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తాడోనని పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఈ సమయంలో కేసీఆర్ తలసానిని మీద చర్యలు తీసుకోకపోవచ్చని సీనియర్ నేతలు అంటున్నప్పటికి కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడని  పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ కు తలసానికి మధ్య ఏర్పడిన అంతరం తగ్గుతుందా లేక తలసాని మరో ఈటెల అవుతాడా అన్న చర్చ టిఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది.

Also Read: Kangana Ranaut Hot Pics: బాబోయ్ కంగనా రనౌత్.. ఎద అందాలు చూపిస్తూ చంపేస్తోందిగా!

Also Read: Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More