Home> తెలంగాణ
Advertisement

Revanth Reddy press meet: మోదీ, నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ వాడిన బూతులు వింటే సిగ్గనిపిస్తోంది.. టీఆర్ఎస్, బీజేపికి షాకిచ్చిన రేవంత్

Revanth Reddy Reaction on Budget 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Revanth Reddy press meet: మోదీ, నిర్మలా సీతారామన్‌పై కేసీఆర్ వాడిన బూతులు వింటే సిగ్గనిపిస్తోంది.. టీఆర్ఎస్, బీజేపికి షాకిచ్చిన రేవంత్

Revanth Reddy Reaction on Budget 2022: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం కేసీఆర్ మాటల్లో మర్యాద లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై గంటన్నరసేపు ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే... నల్ల మందు కలిపిన కల్లు తాగిన వాళ్లు ఎలా వ్యవహరిస్తారో అలాగే అనిపించింది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించని సీఎం కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా అతి జుగుస్పాకరమైన భాష ఉపయోగించడం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2022పై స్పందిస్తూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

Revanth Reddy about Budget 2022 - బడ్జెట్ గురించి రేవంత్ రెడ్డి: 
కేంద్ర బడ్జెట్‌ 2022 గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. '' కేంద్ర బడ్జెట్ ఎవ్వరికీ మేలు జరిగేలా లేదు. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా పోరాటం చేసిన రైతులపై కక్ష పెంచుకున్న మోదీ.. నిన్న ప్రవేశపెట్టిన  బడ్జెట్‌లో ఎరువులపై సబ్సీడీ తగ్గించారు. వరి, కొనుగోలు విషయంలో నిధులు తగ్గించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25 వేల కోట్ల నిధుల కోత విధించారు'' అని ఆరోపించారు. 

ప్రధాని మోదీ ప్రభుత్వంలో, పరిపాలనలో నోట్ల రద్దు, జీఎస్టీ విధానం, కరోనావైరస్ వ్యాప్తి, రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటంలో చనిపోయిన రైతులను ఆదుకునే విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై దేశ ప్రజలందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. దేశ ప్రజలు అందరూ అభద్రతా భావంతో ఉన్న ప్రస్తుత సమయంలో కనీసంలో ఈ బడ్జెట్‌లోనైనా (Budget 2022 news) గతంలో చేసిన తప్పులను సవరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఆదుకుంటుందోదేమోనని ఎదురుచూస్తే.. ఇప్పుడు కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy press meet) ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే...

Also read : ECLGS scheme extended: కరోనాతో నష్టపోయిన వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈసిఎల్జీఎస్ పథకం పొడిగింపు

Also read : CM KCR slams BJP: రామానుజా చార్య విగ్రహంతో బీజేపి రాజకీయం.. అసదుద్దీన్ ఒవైసి అక్కడ పార్టనర్.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Also read : Budget 2022 Political Reaction : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. శ్లోకాలు చెప్పి మరీ మోసం చేశారని ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More