Home> తెలంగాణ
Advertisement

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన COVID-19 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన COVID-19 పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకు తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసుల సంఖ్యలో తాజాగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో నేడు కొత్తగా మరో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 30 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే వెలుగుచూడగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చిన మరొకరికి పాజిటివ్ రావడం గమనార్హం. తాజాగా తెలంగాణ వైద్య ఆర్యోగశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ( COVID-19 health bulletin ) ప్రకారం నేడు గుర్తించిన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య 1,163కు చేరింది. 

Also read : Vizag gas leak tragedy : విశాఖలో విష వాయువు చిమ్మిన పరిశ్రమ ఎదుట మిన్నంటిన ఆందోళనలు

దురదృష్టవశాత్తుగా ఇవాళ కరోనావైరస్‌తో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 30కి చేరింది ( COVID-19 death toll ). కరోనావైరస్ నుంచి కోలుకున్న మరో 24 మందిని శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 751 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 382 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More