Home> తెలంగాణ
Advertisement

COVID-19 updates: తెలంగాణలో 92కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి. 

COVID-19 updates: తెలంగాణలో 92కి చేరిన కరోనా మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే 70 కేసులు వెలుగుచూశాయి. ఇవి కాకుండా రంగారెడ్డి జిల్లాలో 7 కరోనా పాజిటివ్ కేసులు, మేడ్చల్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు, నల్గొండ జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదు చేసుకోగా.. మహబూబ్‌నగర్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులు అన్నింటితో కిలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. Cancer patients: క్యాన్సర్‌ పేషెంట్స్‌కి కరోనా వస్తే.. ? )

తెలంగాణ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 1,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం కరోనాతో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం  92కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,273 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలోనూ పెరుగుతున్న కరోనా కేసులు.. వీళ్లకే అధిక రిస్క్! )

ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలసకూలీలలో 204 మందికి కరోనా సోకినట్టు హెల్త్ బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ 212 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు గుర్తించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More