Home> తెలంగాణ
Advertisement

B. B. Patil: జహీరాబాద్ ఎంపీ పాటిల్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే అధికార పార్టీ టీఆర్‌ఎస్ (TRS) చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎంపీ (TRS MP) సైతం కరోనా బారిన పడ్డారు.

B. B. Patil: జహీరాబాద్ ఎంపీ పాటిల్‌కు కరోనా పాజిటివ్

TRS MP B. B. Patil tests COVID-19 positive: హైదరాబాద్: తెలంగాణ (Telangana) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే అధికార పార్టీ టీఆర్‌ఎస్ (TRS) కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎంపీ (TRS MP) సైతం కరోనా బారిన పడ్డారు. గురువారం జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌ ( MP B. B. Patil) కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విషయాన్ని బీబీ పాటిల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ద్వారా ప్ర‌క‌టించారు. త‌నకు తేలికపాటి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని పాటిల్ తెలిపారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన వారంతా క్వారంటైన్‌లో ఉంటూ కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవాలని ఎంపీ సూచించారు. Also read: Navratri Day 6: లలిత త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం

ఇదిలాఉంటే.. అక్టోబరు 13న ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే తెలంగాణలో బుధవారం కొత్తగా 1,456 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,27,580 కి చేరగా.. మరణాల సంఖ్య 1,292 కి పెరిగింది. ఇప్పటివరకు 2,06,105 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 20,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  Also read: RRR Movie NTR teaser: ‘వాడి పొగరు ఎగిరే జెండా’.. గర్జించిన కొమరం భీమ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More