Home> తెలంగాణ
Advertisement

Love Affair: వామ్మో.. ఇదేం నిర్వాకం .. బూర్ఖా వేయించి ప్రియుడిని లేడీస్ హస్టల్ కు తీసుకెళ్లిన యువతి.. ఆ తర్వాత..

Warangal: యువతి తన లవర్ కు బుర్ఖావేసింది. దీన్ని అక్కడున్న కొందరు యువకులు గమనించారు. మెల్లగా వీరిని ఫాలో అయ్యారు. లేడీస్ హస్టల్ ముందు ఈ డ్రామాను బైటపెట్టారు. దీంతో బుర్ఖాధరించిన యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన  కాకతీయ యూనివర్సీటిలో చోటు చేసుకుంది. 
 

Love Affair: వామ్మో.. ఇదేం నిర్వాకం .. బూర్ఖా వేయించి ప్రియుడిని లేడీస్ హస్టల్ కు తీసుకెళ్లిన యువతి.. ఆ తర్వాత..

Boy Weraing Burkha At Kakatiya University: సాధారణంగా అమ్మాయిల హస్టల్స్  దగ్గర గట్టి బందో బస్తు ఉంటుంది. కానీ కొందరు కేటు గాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి లేడీస్ హస్టల్ లోకి వెళ్తుంటారు. అక్కడ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటికే లేడీస్ హస్టల్ లో కేటుగాళ్లు ప్రవేశించి, తన్నులు తిన్న అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఇప్పటికే ఓయూలో హస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు, తమ భద్రత పట్ల ఆందోళన చెందుతూ రోడ్డుమీదకు వచ్చి తీవ్ర నిరసలను చేపట్టారు.

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

ఇదిలా ఉండగా.. వరంగల్ కాకతీయ యూనివర్సీటి లేడీస్ హస్టల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతి తన ప్రియుడికి బుర్ఖా ధరింపచేసింది. అంతేకాకుండా..తనతో పాటు మెల్లగా హస్టల్ లోకి తీసుకెళ్తుంది. అక్కడే ఉన్న కొందరు యువకులు ఈ తతంగాన్నిగమనిస్తున్నారు. వీరిద్దరిని ఫాలో అయ్యారు. అంతే కాకుండా లేడీస్ హస్టల్ లో ప్రవేశిస్తున్న వీరిని అడ్డగించారు. యువకుడితో గుర్ఖా తీయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.

సదరు యువకుడు..కూడా వాగ్వాదానికి దిగాడు. యువతి కూడా తను చేసిన పనికి ఏ మాత్రం సిగ్గుపడకుండా, ప్రియుడికే సపోర్ట్ చేసింది. దీంతో అక్కడున్న విద్యార్థినులు కూడా ఆశ్యర్యానికి గురయినట్లు సమాచారం. విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన హస్టల్ డైరెక్టర్ వరకు వెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. సదరు యువతి ఎంబీఏ చదువుతుందని తెలిపారు.  

Read More: Allu Arjun: కాంగ్రెస్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఆ స్థానం ఎంపీ సీట్ కన్ఫార్మ్..?..అంటూ వార్తలు..

రాత్రి వేళ లేడీస్ హస్టల్ లో ఇదేం నిర్వాకం అంటూ నోరెళ్ల బెడుతున్నారు. యువకులు గమనించకుంటే.. మిగతా విద్యార్థినులు ఇబ్బంది పడేవారు కదా అని కొందరు మండిపడుతున్నారు. కాగా, ఈ రచ్చ కాస్త కేయూలో ప్రస్తుతం హట్ టాపిక్ గా మారింది.  రాత్రి 8 తర్వాత విద్యార్థినులు హస్టల్ నుంచి బైటకు వెళ్లాలంటే, సిబ్బంది అనుమతి తప్పనిసరి అని లేడీస్ హస్టల్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి పనులను మానుకొవాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More