Home> తెలంగాణ
Advertisement

పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు?

తెలంగాణలో విడుదలైన పోలీస్ విభాగ ఉద్యోగాలకు వయో పరమితిని ప్రభుత్వం 3 సంవత్సరాల మేర సవరించనుంది.

పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు?

తెలంగాణలో విడుదలైన పోలీస్ విభాగ ఉద్యోగాలకు వయో పరిమితిని ప్రభుత్వం 3 సంవత్సరాల మేర సవరించనుంది. అయితే గతంలో మాదిరిగా ఆరేళ్లు కాకుండా మూడేళ్ల సడలింపుపై పోలీసు శాఖలో అంతర్గతంగా చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట్ర వయో పరిమితి 22  నుంచి 25 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 25 నుంచి 28కి పెరిగనుంది. ఇటీవల నోటిఫికేషన్ రాకపోదవంతో చాలా కాలం ఎదురుచూస్తున్నవారు అర్హులవుతారని నిరుద్యోగులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో 2-3 రోజుల్లో సానుకూల నిర్ణయం రానుండగా.. పెంపుతో 30 వేల మందికి పోటీకి అవకాశం లభించనుంది.  

18 వేలకు పైగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి నియామకాల్లో ఆరేళ్ల పాటు వయోపరిమితి సడలింపు కల్పించగా 75 వేల మందికి పైగా అవకాశం లభించింది.

పోలీసు బోర్డు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌తో రెండు, మూడు రోజుల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటె లిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్‌ తదితర అధికారులు చర్చించే అవకాశముందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి పొందడానికి అధికారులు ప్రయత్ని స్తున్నట్లు సమాచారం.  2, 3 రోజుల్లో సడలింపుపై ఉత్తర్వులు వెలువడతాయని..సవరణ చేస్తూ మరిసారి నోటిఫికేషన్‌ ఇస్తామని అధికారులు చెప్పారు.

Read More