Home> తెలంగాణ
Advertisement

Telangana: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్ధిక సహాయం

Telangana: కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ. కుటుంబానికి ఆర్ధిక సహాయంతో పాటు ఇంటికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తోంది.

Telangana: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్ధిక సహాయం

Telangana: కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ. కుటుంబానికి ఆర్ధిక సహాయంతో పాటు ఇంటికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తోంది.

కరోనా మహమ్మారి (Corona pandemic)కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల అకాల మరణంతో కుటుంబాలు రోడ్డునపడ్డ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో బాధిత కుటుంబాల్ని ఆదుకునేందుకు నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ. కరోనా వైరస్ కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ (Allam Narayana)తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్లపాటు నెలకు 3 వేల పింఛను కూడా లభిస్తుందని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబంలో పదవ తరగతిలోపు చదువుకుంటున్నవారిలో గరిష్టంగా ఇద్దరికి..నెలకు వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో 70 మంది జర్నలిస్టులు కోవిడ్ (Journalists died with corona)కారణంగా మరణించారు. కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం (Telangana government) ఇప్పటివరకూ 5.15 కోట్ల ఆర్ధిక సహాయం చేసిందని అల్లం నారాయణ వివరించారు. మీడియా అకాడమీ ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్, మాసాబ్ ట్యాంక్‌లో ఉన్న సమాచారభవన్‌లోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీకు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

Also read: Rythu Bandhu Amount: నేడు ఆ అన్నదాతల బ్యాంకు ఖాతాలకు రైతుబంధు నగదు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More