Home> తెలంగాణ
Advertisement

Revanth Reddy: రాహుల్ గాంధీ జీ..మరోసారి రండి..రేవంత్‌ రెడ్డి పిలుపు..!

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్ పెంచింది. వరంగల్‌ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈక్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Revanth Reddy: రాహుల్ గాంధీ జీ..మరోసారి రండి..రేవంత్‌ రెడ్డి పిలుపు..!

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్ పెంచింది. వరంగల్‌ సభతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈక్రమంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌ డీక్లరేషన్‌ను జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఉదయ్‌పూర్‌ చింతన్ శివిర్‌లో వరంగల్ రైతు సంఘర్షణ సభపై చర్చ జరిగిందన్నారు.

ఉదయ్‌పూర్‌లో తీసుకున్న ప్రతి అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని..దీనిని సోనియా గాంధీకి పంపుతామని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చ బండ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మే 21న ముఖ్య నేతలంతా ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించాలని తెలిపారు. జూన్ 21 వరకు రైతు రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

పీసీసీ చీఫ్‌గా తాను వరంగల్ జిల్లా జయశంకర్‌ సొంత గ్రామంలో పాల్గొంటానన్నారు రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా అన్ని గ్రామాల్లో విజయవంతం చేసేలా కృషి చేయాలని తెలిపారు. తెలంగాణలో రాహుల్ గాంధీ(RAHUL GANDHI) వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేలా చూద్దామని పార్టీ నేతల సమావేశంలో రేవంత్‌రెడ్డి అన్నారు. అక్టోబర్ 2న రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట తెలంగాణలోనే జరిగేలా తీర్మానం చేశామని చెప్పారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమం దేశానికి రోల్ మోడల్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో చక్రం తిప్పుదామన్నారు. నేతలంతా కలిసి పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడాలన్నారు రేవంత్ రెడ్డి.

Also read: TDP Mahanadu: మహానాడుతో టీడీపీలో జోష్‌ వస్తుందా..చంద్రబాబు ఏమంటున్నారు..!

Also read: India-China Border: దేనికైనా రెడీ..చైనాకు ధీటుగా భారత్ సమాధానం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Read More