Home> తెలంగాణ
Advertisement

Telangana schools: తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

Schools Reopen: దాదాపు రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టారు. సమ్మర్ హాలీడే తర్వాత తెలంగాణలో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి

Telangana schools: తెలంగాణలో తెరుచుకున్న స్కూల్స్.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

Schools Reopen: దాదాపు రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడి బాట పట్టారు. సమ్మర్ హాలీడే తర్వాత తెలంగాణలో స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులను ఆటపాటలతో ఎంజాయ్ చేసిన దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు సరస్వతి కేంద్రాల బాట పట్టారు. తెలంగాణలో కొవిడ్ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే డబుల్ అయ్యాయి. మరో రెండు వారాల వరకు కొవిడ్ కేసులు పెరుగుతాయని వైద్యశాఖ ప్రకటించింది. అటు ఎండలు ఇంకా మండిపోతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు చెక్ పెట్టిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని ప్రకటించారు.

తెలంగాణలోని మొత్తం 26 వేల 605 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 26 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. గురుకులాలు, కస్తూరిబా విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌లో మరో రెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 10 వేల 8 వందల ప్రైవేటు స్కూళ్లలో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులున్నారు. మొత్తం తెలంగాణలోని 60 లక్షల మంది విద్యార్థులు బ్యాగులేసుకుని బడి బాట పట్టారు. ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించింది తెలంగాణ సర్కార్. 1 నుంచి 8 తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పనున్నారు. ఇందుకోసం 80 వేల మంది టీచర్లకు ప్రభుత్వం ప్రత్యేక్ష శిక్షణ ఇచ్చింది.

కొవిడ్ మహమ్మారితో గత రెండేళ్లు స్కూళ్లు జూన్ లోనే మొదలు కాలేదు. 2020-21 సంవ్సతరంలో దాదాపుగా తెరుచుకోలేదు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లిష్‌ మీడియంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యార్థుల కోసం  తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లో బుక్స్ ముద్రించారు. అయితే ఇంగ్లిష్‌ మీడియం బుక్స్ ఇంకా స్కూళ్లకు సరఫరా కాలేదని తెలుస్తోంది.

Read also:Monsoon: తెలంగాణలో ఇక వానలే వానలు.. ఇవాళే రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ..

Read also: Pension for Labour: రోజుకు 2 రూపాయలు పొదుపు..నెలకు 3 వేల పెన్షన్..కార్మికులు, కూలీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More