Home> తెలంగాణ
Advertisement

Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 1097 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana Reports 1,097 New COVID-19 Positive Cases | తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,070 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి తొంబై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 

Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 1097 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases : తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో 1000కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,097 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,237కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 43,070 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి తొంబై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 13 వేల 2 వందల ముప్పై ఏడుకు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,723కి చేరింది.

Also Read: Gold Price Today 05 April 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 268 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,02,768 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 302 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు లేకపోతే జరిమానాలు సైతం విధిస్తూ కోవిడ్-19(COVID-19) నిబంధనలు కఠినతరం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 4,458 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 05, 2021, ఓ రాశివారికి వాహనయోగం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More