Home> తెలంగాణ
Advertisement

Telangana Lockdown: తెలంగాణలో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ మరీ కఠినం

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ మరింత కఠినమైంది. నిబంధలు ఉల్లంఘిస్తే కేసులు  రాస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుుకునేవారికి వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు రంగంలో దిగి పర్యవేక్షిస్తున్నారు.
 

Telangana Lockdown: తెలంగాణలో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ మరీ కఠినం

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ మరింత కఠినమైంది. నిబంధలు ఉల్లంఘిస్తే కేసులు  రాస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుుకునేవారికి వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీలు రంగంలో దిగి పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్ (Telangana Lockdown) పటిష్టంగా అమలవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పడం లేదు. లాక్‌డౌన్ పర్యవేక్షణకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్(Cm KCR), డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలో దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కరోనా నిబంధనల్ని పాటించనివారిపై కేసులు బుక్ చేస్తున్నారు. లాక్‌డౌన్ గీత దాటారా..వాహనాలు సీజ్ అవుతున్నాయి. ఉదయం పది గంటలు దాటాక రోడ్డెక్కితే ఆ వాహనాల్ని సీజ్ చేసేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని చెక్ పోస్టుల వద్దైతే స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఉదయం 6 గంటల్నించి 10 గంటల వరకూ మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సరిహద్దుల (Telangana Borders) వద్ద లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. మూడు కమీషనరేట్ల పరిధిలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ పాసుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకూ లాక్‌డౌన్(Lockdown) సమయంలో బయటకు వచ్చిన వారి వాహనాలపై చలానా విధించేవారు. ఇప్పుడు ఏకంగా సీజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం పది గంటల తరువాత బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే ఐడీ కార్డు గానీ, లెటర్ గానీ తీసుకుని బయటకు రావల్సి ఉంటుంది. అకారణంగా బయటకు వచ్చేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Also read: Telangana: తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా మైక్రో కంటెన్మైంట్ జోన్స్ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More