Home> తెలంగాణ
Advertisement

Junior doctors strike: సమ్మె ఉపసంహరించకపోతే తదుపరి చర్యలు

Junior doctors strike: తెలంగాణ జూనియర్ డాక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల వేళ వైద్యులు సమ్మెకు దిగడంపై వ్యతిరేకత వస్తోంది. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వమూ హెచ్చరిస్తోంది.

Junior doctors strike: సమ్మె ఉపసంహరించకపోతే తదుపరి చర్యలు

Junior doctors strike: తెలంగాణ జూనియర్ డాక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల వేళ వైద్యులు సమ్మెకు దిగడంపై వ్యతిరేకత వస్తోంది. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వమూ హెచ్చరిస్తోంది.

దేశమంతా కరోనా మహమ్మారితో(Corona Pandemic) పోరాడుతోంది. కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ కొరత ఓ వైపు, అత్యవసర మందుల కొరత మరోవైపు వెంటాడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ(Telangana)లోని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె చేపట్టారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన విధుల్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ సాధన కోసం తెలంగాణ జుడా సమ్మె నోటీసిచ్చింది. పదిహేను రోజుల్లోగా డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్ప్టష్టం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగినట్టు జుడా సంఘం స్పష్టం చేసింది. 

కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు సమ్మెకు ( Junior Doctors strike) దిగడంపై విమర్శలు వస్తున్నాయి. జూనియర్ డాక్టర్ల వ్యవహారంపై వ్యతిరేకత వస్తోంది. జూనియర్ డాక్టర్ల సమస్యల్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని..తక్షణం సమ్మె ఉపసంహరించాలని మంత్రి కేటీఆర్ (Telangana Minister Ktr) కోరారు. సమ్మె చేసేందుకు ఇది తగిన సమయం కాదన్నారు. లేకపోతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 

Also read: Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More