Home> తెలంగాణ
Advertisement

సీఎం కేసీఆర్‌ నోట ‘నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’

భారత దేశ చరిత్రలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ నోట ‘నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’

తెలంగాణ అంటే రైతు రాజ్యమని, భారత దేశ చరిత్రలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. చరిత్రలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలో కూడా, ఎప్పుడూ కూడా రైతుల మొత్తం ధాన్యాన్ని కొన్న దాఖలాలు లేవన్నారు. భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్‌, సీసీఐ, ఇతరత్రా పార్టీలు పారిపాలన చేశాయి. మత్స్యకారులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ.10వేలు

దేశ చరిత్రలో రైతుల మొత్తం పంటను కొన్న రాష్ట్రం ఏదీ లేదని, నెవర్‌ బిఫోర్‌ నెవర్‌ ఆఫ్టర్‌ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మీడియా సమావేశంలో కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను రైతులు కచ్చితంగా గుర్తుంచుకోవాలని, ఎవరో చెప్పిన చెడు మాటలు విని రాజకీయ డ్రామాలలో ఇరుక్కోవద్దని రాష్ట్ర రైతులకు సూచించారు. మద్దతు ధర వంద శాతం ఇచ్చి, గ్రామాలకే వెళ్లి ధాన్యం కొంటున్న ప్రభుత్వం తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. మందుబాబులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక

కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్ గడువును మే 29వరకు పొడిగించడం తెలిసిందే. మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. నేటి నుంచి మద్యం షాపులు తెరవనున్నట్లు ఆ సందర్భంగా తెలిపారు. భౌతిక దూరం పాటించడం అనేది చాలా ముఖ్యమని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Read More