Home> తెలంగాణ
Advertisement

Telangana: నోటిఫికేషన్ కంటే ముందే..వరద సహాయం ఎందుకు ఇవ్వలేదు

ఎన్నికల సమయంలో బాధితులకు సహాయం చేయకూడదా..ఇదే ఇప్పుడు హైాకోర్టులో చర్చనీయాంశమైన ప్రశ్న. డిసెంబర్ 4 తరువాతే వరద సహాయం అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Telangana: నోటిఫికేషన్ కంటే ముందే..వరద సహాయం ఎందుకు ఇవ్వలేదు

ఎన్నికల సమయంలో బాధితులకు సహాయం చేయకూడదా..ఇదే ఇప్పుడు హైాకోర్టులో చర్చనీయాంశమైన ప్రశ్న. డిసెంబర్ 4 తరువాతే వరద సహాయం అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్ వరదల్లో( Hyderabad Floods ) నష్టపోయిన బాధితులకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఖాతాల్లో వేసే పథకానికి ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. వరద బాధితులందరికీ సహాయం అందేలోగా..గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ( Greater Election Notification ) వెలువడటంతో..ఈ సహాయాన్ని నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమీషన్ ( Election commission ) ఆదేశించింది. అయితే వరద బాధితులకు సహాయం కొనసాగించాలంటూ హైకోర్టు ( High court ) లో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగింది. బాధితులకు సహాయం ఆపకూడదనే నిబంధన ఎలక్షన్ కమీషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉందా అని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల నియమావళే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ( GHMC Elections ) కూడా వర్తిస్తుందని ఎన్నికల కమీషన్ తెలిపింది. బాధితుల కోసం ఉద్దేశించిన సహాయాన్ని కొంతమంది పార్టీవాళ్లకే ఇస్తున్నందున..ప్రస్తుతానికి నిలిపివేశామని ఎన్నికల కమీషన్ కోర్టుకు వివరించింది. 

అయితే ఈ పథం తప్పుదోవ పట్టకూడదనే ఉద్దేశ్యంతోనే నిలిపివేశామని ఎన్నికల కమీషన్ చెప్పింది. ఎన్నికల అనంతరం తిరిగి కొనసాగించవచ్చని పేర్కొంది. బాధితులకు అందించే సహాయాన్ని ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆపడం రాజ్యాంగ విరుద్ధంగా పిటీషనర్ తెలిపారు. నోటిఫికేషన్ కంటే ముందే వరద బాధితుల సహాయ పధకం అమల్లోకి వచ్చిందని చెప్పారు. అయితే నోటిఫికేషన్ రాకముందే..బాధితుల ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై డిసెంబర్ 4 న కౌంటర్ దాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది. Also read: GHMC Elections: సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై దుమారం

Read More