Home> తెలంగాణ
Advertisement

N Convention Demolition Issue: కూల్చివేతపై హైకోర్టు స్టే కానీ ఫలితం శూన్యమే

N Convention Demolition Issue: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే మంజూరు చేసింది. మరోవైపు నాగార్జున కూడా ఎక్స్ వేదికగా ఇది పూర్తిగా అన్యాయమని స్పందించాడు.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

N Convention Demolition Issue: కూల్చివేతపై హైకోర్టు స్టే కానీ ఫలితం శూన్యమే

N Convention Demolition Issue: మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చేశారు. చెరువుని ఆక్రమించి అక్రమంగా నిర్మించారనే కారణంతో హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే మంజూరు చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మోనిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు ఇవాళ ఉదయం ఆగమేఘాలపై  నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేశారు. దీనిపై నాగార్జున టీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే మంజూరు చేసింది. కూల్చివేతలు ఆపాల్సిందిగా ఆదేశాలిచ్చింది. కానీ అప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తయిపోయింది. జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతను నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ఘటనపై నాగార్జున ఎక్స్ వేదికపై స్పందించారు. అదంతా పట్టా భూమి అని, ఒక్క అంగుళం కూడా అక్రమణకు గురి కాలేదని స్పష్టం చేశారు. కూల్చివేతకై గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా ఉందని అయినా సరే హైడ్రా అధికారులు కూల్చివేతకు పాల్పడ్డారని విమర్శించారు. కూల్చివేత అనేది పూర్తిగా తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. కూల్చివేతకు ముందు కూడా ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కూల్చివేతకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే తానే దగ్గరుండి కూల్చివేసేవాడినన్నారు. ఈ పరిణామాలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమున్నందున తాను స్పందిస్తున్నానన్నారు. 

ప్రస్తుతం హైకోర్టు కూల్చివేతపై స్టే మంజూరు చేసినా అప్పటికే కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. దాంతో స్టే వల్ల ప్రయోజనం లభించలేదు. అయితే తదుపరి ప్రక్రియపై కోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. 

Also read: N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఉన్నదెవరు, కోమటిరెడ్డి ఫిర్యాదే కారణమా, ఇంకేమైనా ఉందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More