Home> తెలంగాణ
Advertisement

COVID-19 tests: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్‌ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.

COVID-19 tests: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్‌ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని తెలంగాణ హైకోర్టు ( High court) హెచ్చరించింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులను బాధ్యుల్ని చేస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు సైతం కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( COVID-19 tests) చేయాలనే ఆదేశాలను అమలు చేయడం లేదనే విషయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. Bandi Sanjay: తెలంగాణ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు )

మీడియాకు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్‌లో ( Health bulletin) పూర్తి గణాంకాలు వెల్లడించకుండా తప్పుడు లెక్కలు ఇస్తే.. అందుకు బాధ్యులైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైనే చర్యలు తీసుకుంటామని హైకోర్టు తేల్చిచెప్పింది. కరోనావైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు కేసుల గణాంకాలను కూడా పత్రికలు, వెబ్‌సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం సరైనరీతిలో ప్రచారం చేయడం లేదని.. ఫలితంగా కరోనా తీవ్రత ఎలాంటిదో ప్రజలకు తెలిసే అవకాశం ఉండదని కోర్టు దృష్టికి తీసుకొస్తూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా హైకోర్టు ఈ హెచ్చరికలు చేసింది. BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం )

కరోనావైరస్ గణాంకాలకు సంబంధించిన సమాచారం దాచితే.. కరోనా ప్రభావం ( Coronavirus spread) మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు జవాబు చెబుతూ ఈ నెల 17 లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖకు హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More