Home> తెలంగాణ
Advertisement

తెలంగాణలో కోవిడ్ పరీక్షలపై ఆరోపణలు.. స్పందించిన మంత్రి ఈటల

అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

తెలంగాణలో కోవిడ్ పరీక్షలపై ఆరోపణలు.. స్పందించిన మంత్రి ఈటల

హైదరాబాద్: అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోందని వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో తక్కువ సంఖ్యలో కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నామని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఆయన.. కేంద్రం, ఐసీఎంఆర్ (ICMR) ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం, ఐసిఎంఆర్ ఇచ్చిన సూచనల ప్రకారం కరోనావైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన వారికి, అనుమానితులకు మాత్రమే కోవిడ్ పరీక్షలు చేయాలని... తెలంగాణ సర్కార్ అదే నిబంధనలను అనుసరిస్తోందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. 

Also read: COVID-19 cases in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

ఇతర రాష్ట్రాలలో మాదిరిగా కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టులు కూడా చేయడం లేదనే ఆరోపణలపైనా మంత్రి ఈటల స్పందిస్తూ... ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ర్యాపిడ్ టెస్టులపై ఎవరికీ సరైన స్పష్టత లేదని.. అందుకే తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయవద్దని సీఎం కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వెనక్కి పంపించాలని ఇటీవల ఐసీఎంఆర్ సైతం కోరిందనే విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్  ఈ సందర్భంగా గుర్తుచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More