Home> తెలంగాణ
Advertisement

New pensions and ration cards: తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా ?

New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

New pensions and ration cards: తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా ?

New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పెన్షన్స్, కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సదరు వార్తల సారాంశం. అలాగే, వృద్ధాప్య పెన్షన్‌కి అవసరమైన అర్హత వయస్సును 60 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సైతం కేసీఆర్ నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.

మంత్రి కేటీఆర్ (Minister KTR) ఇటీవల వరంగల్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఈ అంశంపై మాట్లాడుతూ.. ''పెండింగ్‌లో ఉన్న పెన్షన్స్, రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి త్వరలోనే కొత్త కార్డులను జారీ చేస్తామని ప్రకటించారు. మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన సైతం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.

Also read : Nagarjuna sagar Bypoll: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు

తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారుల (Pensions in Telangana) గణాంకాలు..
తెలంగాణలో ప్రస్తుతం సుమారు 39.5 లక్షల మంది ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులు ఉండగా, వీరిలో 13.5 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధాప్య ఆసరా పెన్షన్ పథకానికి అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించనుండటంతో కొత్తగా మరో 8 లక్షల మంది లబ్ధిదారులు అవకాశం పొందనున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

కొత్త రేషన్ కార్డులు (New ration cards in TS) ..
రాష్ట్రంలో ప్రస్తుతానికి తొమ్మిది లక్షలకుపైనే రేషన్‌ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. రేషన్ కార్డులు లేకపోవడంతో పలు సంక్షేమ పథకాలకు కూడా అర్హత కోల్పోతున్నామని లబ్ధిదారులు ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా రేషన్ కార్డులు (Ration cards) మంజూరు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పెన్షన్స్, రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తున్న లబ్ధిదారులకు అవి అందినట్టయితే, కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలకు దూరమైన వారికి కొంతమేరకు ఊరట లభించినట్టే.

Also read : AP Ration Cards : 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసిన ఏపి ప్రభుత్వం

Also read : Telangana Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు

Also read : COVID-19 Positive Cases: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా, తాజాగా 3 వేల పైగా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More