Home> తెలంగాణ
Advertisement

EWS Reservations: Telanganaలో అగ్రవ‌ర్ణ పేద‌ల‌కు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

EWS Reservations In Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) ఇకనుంచి పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.

EWS Reservations: Telanganaలో అగ్రవ‌ర్ణ పేద‌ల‌కు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

EWS Reservations In Telangana: తెలంగాణలో త్వరలో విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గత నెలలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) ఇకనుంచి పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వెలువడటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి.

Also Read: EPF ఖాతాదారులకు EPFO సరికొత్త సదుపాయం, ఆ సమస్యకు పరిష్కారం

 

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల కోసం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌లకు ప10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు రాష్ట్రాలలో దీనిపై కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో రెగ్యూలర్ రిజర్వేషన్లలో ఏ మార్పులు చేయకుండానే అదనంగా అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

Also Read: Recharge Plans: ఎయిర్‌టెల్, Jio, Vi అందిస్తున్న బెస్ట్ డేటా, కాలింగ్ రీఛార్జ్ ప్లాన్

 

కాగా, తెలంగాణలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తాజాగా ఆమోదించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More