Home> తెలంగాణ
Advertisement

Telangana: రేషన్ కార్డుల జారీలో ఆదాయ ధృవీకరణకు మినహాయింపు

Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇన్‌కం సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రేషన్ కార్డు లబ్దిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 

Telangana: రేషన్ కార్డుల జారీలో ఆదాయ ధృవీకరణకు మినహాయింపు

Telangana: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు యోచిస్తోంది. ఈ నేపధ్యంలో ఆదాయం స్థితిపై సెల్ఫ్ డిక్లరేషన్ పరిగణలో తీసుకోవాలని, ఇన్‌కం సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లబ్దిదారులు చేస్తున్న విజ్ఞప్తిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సి ఉంది. 

2018లో గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసేటప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందడంలో చాలామంది సవాళ్లు ఎదుర్కొన్నారని, దళారులతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని లబ్దిదారులు తెలిపారు. చాలా వరకూ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే తిరస్కరించారని, కనీసం ఎందుకు తిరస్కరించారో కారణం కూడా చెప్పలేదని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు లబ్దిదారుల్ని దళారుల దోపిడీ, వేధింపుల్ని రక్షించేందుకు ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించాలని లబ్దిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం ఇన్‌కం సర్టిఫికేట్ సమర్పించినా సరే దరఖాస్తు తిరస్కరించారని ఓ లబ్దిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

గతంలో ఆదాయ ధృవీకరణ పత్రం పొందేందుకు చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చిందని, ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే కొన్నిరేషన్ కార్డు దరఖాస్తుల్ని తిరస్కరించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఆదాయ ధృవీకరణ పత్రాలకు బదులు, ప్రాంతీయ స్థాయిలో విచారణ ద్వారా అర్హతను నిర్దారించాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరి ధరఖాస్తు అయినా తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారో కారణం స్పష్టం చేయాలని రేషన్ కార్డు లబ్దిదారులు కోరుతున్నారు. 

Also read: Ys Sharmila Delhi Tour: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం, ఇవాళ ఢిల్లీకు వైఎస్ షర్మిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More