Home> తెలంగాణ
Advertisement

Telangana: ప్రజా భవన్ ఇకపై భట్టి విక్రమార్క అధికారిక నివాసం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్‌గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 

Telangana: ప్రజా భవన్ ఇకపై భట్టి విక్రమార్క అధికారిక నివాసం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Telangana: హైదరాబాద్ నడిబొడ్డున బేగంపేట్‌లో ఉండే సువిశాలమైన ఆ భవంతే ప్రగతి భవన్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం వార్తల్లో ఉన్న భవనమిది. అందరి విమర్శలు ఈ బిల్డింగుపైనే ఉండేవి. ప్రగతి భవన్ రాచరికానికి చిహ్నమనే విమర్శలు వెల్లువెత్తేవి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రగతి భవన్ ముందుండే ఇనుప బ్యారికేడ్లు, గేట్లు అన్నింటినీ తొలగించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇది జరిగింది. ప్రగతి భవన్‌ను జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా మార్చారు. అప్పట్నించి ఈ భవనం ప్రజా వాణి కార్యక్రమం కోసం ఉపయోగపడుతోంది. కొండా సురేఖ సహా కొందరు మంత్రులు ప్రజా వాణి కార్యక్రమాన్ని ఇక్కేడ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజల్ని నేరుగా కలుసుకుంటూ వినతులు స్వీకరిస్తున్నారు. కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్నప్పుడు ప్రభుత్వ సమీక్షలన్నీ ఇక్కడే జరిగేవి. నిత్యం మంత్రులు, అధికారుల రాకపోకలతకో కళకళలాడుతుండేది. 

ప్రజా భవన్‌గా మారిన ప్రగతి భవన్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ అధికారిక నివాసాన్ని ఇక నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రగతి భవన్ అలియాస్ ప్రజా భవన్ డిప్యూటీ సీఎం భట్టి నివాసం కానుంది. త్వరలో ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయి..అధికారిక కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 1638ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేశారు. రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భవంతిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Also read: Metro Rail Project: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఓఆర్ఆర్ మెట్రో రద్దు చేసే ఆలోచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More