Home> తెలంగాణ
Advertisement

Rajiv Swagruha Flats for Sale : స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం

Swagruha Flats for Sale : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్ల అమ్మకంపై సంబంధిత అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్లాట్ల విక్రయ విధివిధానాల తుది రూప కల్పనపై అధికారులతో చర్చించారు.

Rajiv Swagruha Flats for Sale : స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం

Swagruha Flats for Sale : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్ల అమ్మకంపై సంబంధిత అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫ్లాట్ల విక్రయ విధివిధానాల తుది రూప కల్పనపై అధికారులతో చర్చించారు.

బండ్లగూడలో మొత్తం 1501 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉండగా.. అందులో పూర్తి స్థాయిలో 419 ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అడుగు 3వేల రూపాయలు చొప్పున.. కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ప్లాట్లు చదరపు అడుగుకు 2750 రూపాయల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. పోచారంలో 1328 ఫ్లాట్లు 2వేల500 రూపాయల చొప్పున.. అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లు 2,250 రూపాయల చొప్పున విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

బండ్లగూడలో 3BHK డీలక్స్ 345 ఫ్లాట్లు, 3BHK 444 ఫ్లాట్లు, 2BHK 712 ప్లాట్లు.. పోచారంలో 3BHK డీలక్స్ 91ఫ్లాట్లు, 3BHK 53 ఫ్లాట్లు, 2BHK 884 ఫ్లాట్లు, 1 BHK 442 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 3BHK డీలక్స్ ఫ్లాట్‌లో ఒక హాల్, 3 బెడ్‌ రూంలు, 3 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ గది, బాల్కనీ సౌకర్యాలుంటాయని వివరించారు. 3BHK ఫ్లాట్‌లో ఒక హాల్, 3 బెడ్‌ రూంలు, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ, 2BHK ఫ్లాట్‌లో హాల్ విత్ కిచెన్,2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ.. 1BHKఫ్లాట్లు హాల్ విత్ కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయని చెప్పారు.

సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దీనికి సంంధించి ప్రత్యేక యాప్ కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నారు. www.swagruha.telangana.gov.in సైట్‌ను పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల  వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చని తెలిపారు.

ఆసక్తికలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6చొప్పున మోడల్ హౌస్‌లు ఏర్పాటు చేశామని, వాటిని సందర్శించవచ్చన్నారు. ఆసక్తి కలిగిన వారి కోసం అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్)గా నిర్ణయించారు. లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుందని వెల్లడించారు. అందుకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు. ఈ సమీక్షా సమావేశం లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ,స్వగృహ సి.ఈ ఈశ్వరయ్య,ఈ.ఈ భాస్కర్ రెడ్డి,పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చిన అర్వింద్

Also Read - Kavitha Vs Arvind Dharmapuri : ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్.. అర్వింద్ సమాధానం ఏంటంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Read More