Home> తెలంగాణ
Advertisement

Home guards salary hike: తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్-30 శాతం వేతనం పెంపు..

Salary hike for home guards in Telangana: కొత్త సంవత్సరం ముంగింట్లో తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు తీపి కబురు చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 30 శాతం పెంచింది. 

 Home guards salary hike: తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్-30 శాతం వేతనం పెంపు..

Salary hike for home guards in Telangana: కొత్త సంవత్సరం ముంగింట్లో తెలంగాణ ప్రభుత్వం హోంగార్డులకు (Telangana Home guards) తీపి కబురు చెప్పింది. హోంగార్డుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 30 శాతం పెంచింది. జులై, 2018 నాటికి ఉన్న వేతనంపై 30 శాతం పెంపును వర్తింపజేయనుంది. పెరిగిన వేతనాలు జూన్, 2021 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేలకు వరకు వేతనం అందుతోంది. తాజా పెంపుతో మరో రూ.6వేలు వరకు వేతనం పెరగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలోని హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే నెల నుంచి పెరిగిన వేతనాన్ని అమలుచేసింది. ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.19వేలుగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మొత్తం 9.21లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని కూడా ప్రభుత్వం రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది.  ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచినప్పుడే హోంగార్డుల వేతన పెంపుపై కూడా ప్రభుత్వం (Telangana Government) హామీ ఇచ్చింది. ఆ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Greater Noida: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిపోయిన యువతి... అసలేం జరిగింది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More