Home> తెలంగాణ
Advertisement

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్‌

తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పంచాయతీ కార్యదర్శుల నియామక నోటిఫికేషన్ వెలువడింది.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్‌

తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పంచాయతీ కార్యదర్శుల నియామక నోటిఫికేషన్ వెలువడింది. దాదాపు 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు సూచనల మేరకు కమీషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపించేందుకు సెప్టెంబరు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు కమీషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.

అదేవిధంగా దరఖాస్తు రుసుము చెల్లించేందుకు ఆఖరు తేది సెప్టెంబరు 10 వరకు మాత్రమే ఉంటుందని నోటిషికేషన్‌లో తెలియజేశారు. ఈ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగానే జిల్లా కేడర్ పోస్టులు ఉంటాయని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ పోస్టుల కోసం 30 జిల్లాల్లో రాతపరీక్షను నిర్వహించనున్నారు. 18 నుండి 39 సంవత్సరాల వయసు ఉండి డిగ్రీ విద్యార్హత కలిగిన వారెవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము క్రింద జనరల్ క్యాటగరీ అభ్యర్థులైతే 500 రూపాయలు... ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 250 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పద్ధతిలో 150 మార్కులకు రెండు పేపర్లలో అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ రాతపరీక్ష సిలబస్‌లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ అంశాలతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలకు పెద్దపీట వేశారు. అలాగే పంచాయితీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ రాతపరీక్షలో అడుగుతారు. 

Read More