Home> తెలంగాణ
Advertisement

Telangana Election 2023: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, చివరిరోజు హోరెత్తనున్న రోడ్ షోలు

Telangana Election 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చివరి ఎన్నికలు మిగిలాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana Election 2023: ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తం, చివరిరోజు హోరెత్తనున్న రోడ్ షోలు

Telangana Election 2023: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇక మిగిలింది తెలంగాణ ఎన్నికలే. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పోలింగ్ ముగిసింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఇవాళ సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తం కానుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇక తెలంగాణ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వ తేదీన జరగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికల కమీషన్ సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 లక్షలమంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14 వేల యూనిట్లు సిద్దం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఆ తరువాత ఎలాంటి ప్రచారం గానీ, ఏ విధమైన ప్రకటనలు గానీ ఉండకూడదు. అంటే తెలంగాణ బరిలో ఉన్న పార్టీలు, అభ్యర్ధులకు కేవలం కొన్ని గంటల సమయమే మిగిలింది. 

అందుకే సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేందుకు పార్టీలు ప్రయత్నించనున్నాయి. ఇవాళ చివరిరోజున భారీగా రోడ్ షోలు ప్లాన్ చేశాయి అన్ని పార్టీలు. కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రోడ్ షోల్లో పాల్గొనబోతున్నారు. ఇవాళ చివరిరోజు ప్రచారం పీక్స్‌కు చేరనున్నందున భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండటంతో చివరి వరకూ గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. గెలిచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని, ఓడిపోయేందుకు కారణమయ్యే ఏ చిన్న అంశాన్ని వదులుకోవడం లేదు. ఏది తప్పు ఏది ఒప్పు అనే కంటే ప్రజల్ని ఎంతవరకూ తమవైపు తిప్పుకోగలుగుతున్నామనేదే ప్రధానాంశంగా మారింది. 

అటు సోషల్ మీడియాలో ప్రచారం చాలా ఖరీదైపోయింది. అంతా డిజిటల్ ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తే..ఆ తరువాత సమయం దాటినా అవే ట్రోల్ అవుతూ ఉంటాయి. అందుకే ప్రచారానికి మిగిలిన కొద్ది గంటలు సోషల్ మీడియా ప్రచారం హోరెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీలు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన తెలంగాణలో తొలిసారిగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో మాత్రం జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. సీట్ల ఒప్పందాలు ఇంకా జరగాల్సి ఉన్నాయి. 

Also read: Ambedkar Statue: స్టాట్యూ ఆఫ్ జస్టిస్‌గా అంబేద్కర్ విగ్రహం, జనవరి 24న ప్రారంభించేందుకు ఏర్పాట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More