Home> తెలంగాణ
Advertisement

EAMCET, ECET exams: ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణపై సర్కార్ వైఖరి

ప్రతీ ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే ఎంసెట్, ఈసెట్ లాంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఈసారి లాక్ డౌన్ కారణంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి.

EAMCET, ECET exams: ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణపై సర్కార్ వైఖరి

హైదరాబాద్ : ప్రతీ ఏడాది ఇంటర్మీడియెట్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే ఎంసెట్, ఈసెట్ లాంటి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఈసారి లాక్ డౌన్ కారణంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జారీ ఆదేశాల ప్రకారం మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుండగా.. ఒకవేళ మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు చాలా మంది విద్యార్థిని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. 

Also read : నా వాహనంలో మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు మంత్రి హరీష్ రావు భరోసా

ఇదే విషయమై తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్పందిస్తూ.. ఒకవేళ మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించినట్టయితే ఎంసెట్‌, ఈసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలను జూన్‌ మూడు లేదా నాలుగోవారానికి వాయిదావేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే డిగ్రీలో డిటెన్షన్‌ విధానాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర పరిధిలోని అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు. ఏదేమైనా రోబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రతను బట్టి సర్కార్ నిర్ణయం ఉంటుందని పాపిరెడ్డి పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More