Home> తెలంగాణ
Advertisement

Telangana Coronavirus: రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా కేసులు

తెలంగాణలో కోవిడ్ కేసులు సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Telangana Coronavirus: రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ కేసులు సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో (జనవరి 12న) మంగళవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. 

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణ (Telangana) లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,90,331 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,571 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: India Covid-19: కొత్తగా 15,968 కరోనా కేసులు

ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 394 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,84,611 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,458 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.92 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది.

Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More