Home> తెలంగాణ
Advertisement

Telangana: తాజాగా 509 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలోనే అధికం!

Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. తాజాగా కేసులు పెరిగాయి. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

Telangana: తాజాగా 509 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలోనే అధికం!

Telangana COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా.. తాజాగా కేసులు పెరిగాయి. నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,644కి చేరింది.

Also Read: TPCC New Chief: తెలంగాణలో ఇప్పట్లో తేలదు.. వీడని సస్పెన్స్!

బుధవారం నాడు ఒక్కరోజే 48,652 శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 509 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదే సమయంలో కరోనాతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,505కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 517 మంది కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,70,9670కు చేరింది. 

Also Read: Forbes 2020 Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

కాగా, తెలంగాణలో ప్రస్తుతం 7,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 5,063 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. తెలంగాణ కరోనా రికవరీ రేటు జాతీయ రేటు కన్నా అధికంగా ఉంది.  తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.53శాతం ఉండగా, రికవరీ రేటు 96.89శాతం మంది కరోనా బాధితులు కోలుకున్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read: Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Read More