Home> తెలంగాణ
Advertisement

Telangana Covid-19: రాష్ట్రంలో 95.49 శాతంగా కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Telangana Covid-19: రాష్ట్రంలో 95.49 శాతంగా కరోనా రికవరీ రేటు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 27న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,68,418 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,451 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: CM BS yediyurappa రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 952 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,56,330 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 10,637 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.49 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. 

ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 41,991 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 27వ తేదీ వరకు మొత్తం 53,74,141 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 133 కేసులు నమోదయ్యాయి. 

fallbacks

 

Also read: Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్

Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More