Home> తెలంగాణ
Advertisement

Telangana Covid-19: గత 24గంటల్లో 862 కరోనా కేసులు 

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Telangana Covid-19: గత 24గంటల్లో 862 కరోనా కేసులు 

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 25న ) బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా (Covid-19) పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,66,904 కి చేరగా.. మరణాల సంఖ్య 1,444 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 961 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,54,676 కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 10,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.41 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్

ఇదిలావుంటే.. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 41,101 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 25వ తేదీ వరకు మొత్తం 52,89,908 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 164 కేసులు నమోదయ్యాయి.

fallbacks

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

 Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Read More