Home> తెలంగాణ
Advertisement

Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.

Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 22న ) ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 602 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,64,128 కి చేరగా.. మరణాల సంఖ్య 1,433 కి పెరిగింది. Also read: Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 1,015 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,51,468 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 11,227 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.20 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Vedhika: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ‘రూలర్’ బ్యూటీ వేదిక

ఇదిలావుంటే.. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 24,139 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 22వ తేదీ వరకు మొత్తం 51,58,474 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో 129 కేసులు నమోదయ్యాయి. Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు

fallbacks

Read More