Home> తెలంగాణ
Advertisement

Charminar Bhagya Laxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు.. పాతబస్తీలో హై టెన్షన్

Charminar Bhagya Laxmi Temple: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు చార్మీనార్ కేంద్రంగా మారింది. చార్మీనార్ తో పాటు అక్కడున్న భాగ్యలక్షి మందిర్ చుట్టూ రెండు రోజులుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

Charminar Bhagya Laxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి కాంగ్రెస్ నేతలు.. పాతబస్తీలో హై టెన్షన్

Charminar Bhagya Laxmi Temple: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు చార్మీనార్ కేంద్రంగా మారింది. చార్మీనార్ తో పాటు అక్కడున్న భాగ్యలక్షి మందిర్ చుట్టూ రెండు రోజులుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. చార్మీనార్ లో ముస్లీంల నమాజ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత సంతకాల సేకరణపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. అటు కాంగ్రెస్ నేతలు కమలం నేతలకు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ కాక పెరిగిపోయింది.

చార్మీనార్ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు పీసీసీ ముఖ్య నాయకులు.. సోనియా గాంధీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంతరావు, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, రాములు నాయక్, అనిల్ యాదవ్, నిరంజన్ భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లారు. చార్మీనార్ పై రగడ సాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నేతలు చార్మీనాగ్ భాగ్యలక్షి మందిర్ కు వెళ్లడం పోలీసులను టెన్షన్ పెట్టించింది. కాంగ్రెస్ నేతలు రాకతో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.

ఇక భాగ్యలక్ష్మి ఆలయంలో పూజల అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేతలు మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్ పై బండి సంజయ్ చేసిన వాఖ్యలు హాస్యాస్పదమన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. బండి సంజయ్ పుట్టక ముందు నుండే కాంగ్రెస్ నేతలు అమ్మవారికి పూజలు చేశారని చెప్పారు. భాగ్యలక్ష్మి దేవాలయం బండి సంజయ్ జాగీరు కాదన్నారు భట్టి విక్రమార్క. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.  సోనియా గాంధీ కొవిడ్ నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన  సోనియా ఆరోగ్యం బాగుండాలని మతాలకు అతీతంగా  పూజలు చేస్తున్నామన్నారు విక్రమార్క.  తెలంగాణ అవిర్బావం  రోజునే సోనియాకి కరోనా రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు సీనియర్ నేత హనుమంతరావు. 

READ ALSO: CM JAGAN DELHI TOUR: అమిత్ షాను కలిసిన సీఎం జగన్.. రాజకీయ అంశాలే అజెండా?

READ ALSO: CM KCR: ఉమ్మడి ఏపీకి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారా?చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More