Home> తెలంగాణ
Advertisement

Telangana CM KCR: కానరాని కత్తెర, సీఎం కేసీఆర్ ఏం చేశారో చూడండి Viral Video

తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటించారు.

Telangana CM KCR: కానరాని కత్తెర, సీఎం కేసీఆర్ ఏం చేశారో చూడండి Viral Video

Telangana CM KCR: దేశంలో విలక్షణత కలిగిన ముఖ్యమంత్రులలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. గత నెల నుంచి పలు జిల్లాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో జులై 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.

తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ (KCR Sircilla Tour) ఆదివారం పర్యటించారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. అయితే అన్ని హంగులు ఆర్భాటాలు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్‌రూమ్ ప్రారంభించానికి కత్తెర ఏర్పాటు చేయడం మరిచిపోయారు. దీంతో కొంత సమయం ఎదురుచూసిన సీఎం కేసీఆర్.. కాస్త ఆగ్రహానికి గురైనట్లు కనిపించారు. రిబ్బన్‌‌ను చేతితో చింపి పక్కకు జరిపి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: TPCC Chief రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే Danam Nagender ఫైర్, చివరిశ్వాస వరకు కేసీఆర్‌తోనని స్పష్టం

తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.80 కోట్ల వ్యయంతో 1,320 డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొందరు లబ్దిదారులకు స్వయంగా ఇళ్ల పట్టాలను అందించారు. అనంతరం సిరిసిల్లలో నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభిచారు. సాయంత్రం రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla District) జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనంతరం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Also Read: Aasara Pensions: పింఛన్‌దారులకు కేసీఆర్ గుడ్‌న్యూస్, ఇకపై 57 దాటితే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More