Home> తెలంగాణ
Advertisement

Budget 2022 Political Reaction : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. శ్లోకాలు చెప్పి మరీ మోసం

Budget 2022 Political Reaction: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

Budget 2022 Political Reaction : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. శ్లోకాలు చెప్పి మరీ మోసం

Telangana CM KCR slams Budget 2022: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. దేశం మొత్తంలో దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఒక రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ కంటే తక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

CM KCR Press Meet Live - సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లోంచి పలు ముఖ్యాంశాలు:

మహాభారతంలో ఉండే శాంతిపర్వంలోని శ్లోకాలు వల్లించి మరీ కేంద్రం దేశాన్ని మోసం చేసింది. 

ప్రధాని మోదీ పరిపాలన అంటే నమ్మి ఓట్లు వేసిన వారిని అమ్ముడు, మందిపై ఏడుసుడు.

మతకల్లోహాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే బీజేపికి తెలిసిన సిద్ధాంతం.

మైనారిటీల సంక్షేమం కోసం బీజేపి ఏమీ ప్రకటించలేదు. మైనారిటీల కోసం అంటేనే కేంద్రానికి గోత్రం లాంటిదేదో అడ్డం వస్తుంది.

కేంద్రం ముందుచూపు లేకుండా భావదారిద్ర్యంతో బాధపడుతోంది.

కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు రైలు టికెట్లు కూడా ఇవ్వలేదు. సొంత ఊర్లకు వెళ్తూ రోడ్లపైనే ఎంతో మంది చనిపోయారు. 

Health sector: ధర్మమార్గంలో నడవాలని మహాభారతంలోంచి శ్లోకాలు చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వైద్య ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులు పెంచలేదు. కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత ఆరోగ్య రంగం పట్ల కేంద్రం ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.

ప్రతీ ఏడాది ప్రకటించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వేలో మొత్తం 116 దేశాలకుగాను మన భారత దేశం 101 స్థానంలో ఉంది. ఇది మోదీ పరిపాలన.

ఆహార సబ్సీడీ కూడా తగ్గించడం దారుణం.

Farmers protests - రైతుల ఆందోళన: రైతులకు క్షమాపణలు చెప్పి మరీ స్వయంగా చట్టాలను ఉల్లంఘించుకున్న ప్రధాని మోదీ ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి, రైతులకు కూడా మేలు చేయలేదు. కనీస మద్దతు ధరపై కూడా ప్రకటన చేయలేదు.

LIC IPO - ఎల్ఐసి ఐపీఓ : ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్రం తాజాగా ఎల్ఐసిని కూడా అమ్మేసేందుకు సిద్ధమైంది. అద్భుతమైన లాభాల్లో ఉన్న LIC సంస్థను ఎందుకు అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విదేశీ సంస్థలకు మేలు చేసేందుకే ఎల్ఐసి సంస్థను అమ్ముతున్నారా అనే సందేహం కలుగుతోంది.

Farmers issues - రైతుల సమస్యలు: 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆ హామీని నిలబెట్టుకోకపోగా వారి పెట్టుబడిని రెట్టింపు చేసింది. కేంద్రం రైతులను మోసం చేసింది కనుకే వాళ్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టాల్సి వచ్చింది.

Black money - నల్లధనం : విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి పంచుతామని కేంద్రం ప్రకటించింది. కానీ ప్రధాని మోదీ హయాంలోనే ఎంతో మంది దేశాన్ని ముంచి నల్లధనంతో విదేశాలకు పారిపోయారు.

International Arbitration in Hyderabad: హైదరాబాద్‌కి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ని అహ్మెదాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్రానికి ఇంత కురుచబుద్ధి అవసరమా ? 

Cryptocurrency - క్రిప్టోకరెన్సీ: క్రిప్టో కరెన్సీపై 30 శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పడం ద్వారా కేంద్రం క్రిప్టో కరెన్సీని అధికారికంగా అంగీకరించినట్టేనా ? కేంద్రం క్రిప్టో కరెన్సీని అధికారికంగా అంగీకరించినట్టేనా సమాధానం చెప్పాలి. ఇలాంటి ప్రకటనలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు.

Connecting rivers: నదుల అనుసంధానంపై ప్రస్తావిస్తూ-- నధుల అనుసంధానం అనే అంశం ఒక పెద్ద జోక్.  గోదావరి, కృష్ణా లాంటి నదుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన ప్రతీ నీటి చుక్కపై తెలుగు రాష్ట్రాలకే హక్కు ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. మరి ఈ నీళ్లను తీసుకెళ్లి కావేరిలో కలపడం అంటే.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమే అవుతుంది.

రాష్ట్రాలను సంప్రదించకుండానే, రాష్ట్రాల ఏకాభిప్రాయం లేకుండానే నదుల అనుసంధానం గురించి ఎలా ప్రకటన చేస్తారు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More