Home> తెలంగాణ
Advertisement

Watch video: లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.

Watch video: లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. విదేశాల నుండి వచ్చిన వారు, వారి కుటుంబసభ్యులకు కలిపి 25,937 మందిని పరీక్షించి క్వారంటైన్ చేయగా అందులో 50 మందికి మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. అందులో విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది కాగా.. వారి కుటుంబ సభ్యులు మరో 20 మంది వరకు ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read : లాక్‌డౌన్ కొనసాగింపుపై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని నిజాముద్దిన్‌లో జరిగిన మర్కజ్‌కి వెళ్లి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆ 172 మంది కారణంగా వారి చుట్టూ ఉన్న వారిలో మరో 93 మందికి కూడా కరోనావైరస్ సోకినట్టు తెలిపారు. సాయంత్రం ప్రగతి భవన్‌లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

 

Also read : కరోనావైరస్ ఎక్కువైన జిల్లాల జాబితా.. దేశంలోనే 4వ స్థానంలో హైదరాబాద్

లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు:
ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని పారదోలడానికి తీసుకుంటున్న నివారణ చర్యల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైరస్‌ను లేకుండా చేయడం కోసం లాక్ డౌన్ తప్ప మరో మార్గం కళ్లముందు కనిపించడం లేదని అన్నారు. జనతా కర్ఫ్యూ తర్వాతి నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నాం. మనమే కాదు.. మరో 22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ పాటించాయి. అంతకు మించి ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి సైతం తాను ఇదే విషయం చెప్పానని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సమయం, సందర్భానుసారం ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. లాక్‌డౌన్ ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు పెడతారనే విషయంలో స్పష్టత అయితే లేదు కానీ.. లాక్ డౌన్ కొనసాగించాల్సిన అవసరం మాత్రం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు.

Read More